ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
Korra Chandu Naik

అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి.

Korra Chandu Naik : దేవరకొండ డివిజన్ జులై 10, త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం లో ఓటరు నమోదు ప్రక్రియ ఫామ్ సబ్మిషన్స్ వేగవంతం కావాలని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యుత్త కీలకమైనదని జనసేన పార్టీ దేవరకొండ నియోజకవర్గ ఇంచార్జ్ కోర్ర చందు నాయక్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న ఓటరు నమోదు కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన పెరగాలి, అర్హులైన ప్రతి ఒక్కరు ఓటు హక్కును పొందేలా చూడాల్సిన బాధ్యత (బి ఎల్ ఓ), ల పై ఉంది, ఫారం సమర్పించిన తర్వాత దరఖాస్తుదారులకు సరైన సమయంలో ఎక్నలెడ్జ్ మెంట్, అక్నలేడ్జిమెంట్ ఎస్సార్ స్టేటస్ రిపోర్ట్ సర్వీస్ రిజిస్టర్ అప్డేట్ విషయంలో ఎటువంటి జాప్యం జరగకుండా, పారదర్శకంగా వ్యవహరించాలి, అని పేర్కొన్నారు ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలబడి ఓటరు నమోదు ప్రక్రియను నిషింతంగా గమనిస్తున్నామని, ఎవరైనా అర్హులైన ఓటర్లకు అన్యాయం జరిగితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.

కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు స్థానిక యంత్రాంగం సహకరించాలని కోరారు. ఓటరు నమోదు ప్రక్రియలో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా నిష్పక్షపాతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు డిమాండ్ చేస్తున్నామని కోర్ర చందు నాయక్ స్పష్టం చేశారు.
ఒకవేళ మీ గ్రామాలలో బి ఎల్ వో..లు రసీదులు ఇవ్వడం లేదని లేదా ఇబ్బంది పెడుతుంటే ఈ నెంబర్ కి 9705076362 కాల్ చేస్తే జనసేన పార్టీ దేవరకొండలో నాయకులు అందుబాటులో ఉంటారని చందు నాయక్ అన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page