
కొర్ర తండా గ్రామపంచాయతీ వృద్ధులకు ప్రజలకు పండ్లు పంపిణీ. —జనసేన పార్టీ సర్పంచ్ అభ్యర్థి కొర్ర సింధు చందు నాయక్ .
Janasena : దేవరకొండ డివిజన్ మార్చ్ 15, త్రినేత్రం న్యూస్. ఉమ్మడి నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం కొర్ర తండా గ్రామపంచాయతీ జనసేన పార్టీ సర్పంచ్ అభ్యర్థి కొర్ర సింధు చందు నాయక్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ 12 వసంతాలు పూర్తిచేసుకుని 13వ వసంతాలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కొర్ర తండా గ్రామపంచాయతీ గ్రామ పెద్దలు మరియు వృద్ధులకు అమ్మవారి ఆలయం ముందు పండ్లు పంపిణీ చేసి జనసేన పార్టీ సిద్ధాంతాలను ఆశలను ప్రజలకు తెలియజేసి క్రియాశీలక సభ్యత్వం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇంచార్జ్ చందు నాయక్ కొర్ర తండా గ్రామ పంచాయతీ పెద్దలు వృద్ధులు తదితరులు పాల్గొన్నారు.

