అల్లూరిజిల్లా అరకులోయ,డిసెంబర్ 29, (త్రినేత్రంన్యూస్): ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులోయ ఆదివారం పర్యాటకులతో హౌస్ ఫుల్ గా మారి కిటకిటలాడింది. వారాంతం కావడంతో పాటు సెలవు దినం కావడంతో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు అరకులోయకు తరలివచ్చారు. దీంతో అరకులోయ మొత్తం జనసంద్రంలా మారింది.
అరకులోయలోని ప్రతి ఖాళీ స్థలం, హోటళ్లు, పర్యాటక కేంద్రాలు, బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాలు అన్నీ జనంతో నిండిపోయాయి. వాహనాల రద్దీ పెరగడంతో ట్రాఫిక్ నియంత్రణ పోలీసులకు పెద్ద సవాలుగా మారింది.
ఈ నేపథ్యంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలుగా అరకులోయ పోలీసులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అరకు ఘాట్ రోడ్డును వన్‌వే విధానంలో నిర్వహించడంతో పాటు, గాలికొండ వ్యూ పాయింట్ మరియు హుడ్డెను బ్రిడ్జి, ప్రాంతాన్ని, సమయం లో మార్పు చేర్పులు చేశారు. అలాగే విశాఖపట్నం నుంచి అరకులోయకు వచ్చే వాహనాలను అనుమతించినప్పటికీ, అరకులోయ నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలను పాడేరు ఘాట్ రోడ్డువైపు మళ్లించారు.
ఈ నిర్ణయాల వల్ల ట్రాఫిక్ నియంత్రణ సాధ్యమైనప్పటికీ, అరకులోయ బస్ స్టాండ్ వద్ద ప్రయాణికులు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సులు అందుబాటులో లేకపోవడం, ప్రైవేటు వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో పర్యాటకులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. కొందరు “అరకులోయ అంటేనే చలికి భయపడే పరిస్థితి” కానీ ఈసారి చలికి కాకుండా, పర్యాటకుల రద్దీకి భయపడిపోయాము అంటూ పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు విశాఖపట్నం ఎస్.కోట నుంచి వచ్చే అరకులోయ స్థానికులు కూడా ఘాట్ రోడ్ నిషేధంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్‌లో వేచి ఉండాల్సి వచ్చింది.
అయితే, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీసులు తీసుకున్న చర్యలను స్థానికులు, పర్యాటకులు ప్రశంసించారు. ముందస్తు జాగ్రత్తల వల్ల పెద్ద ప్రమాదాలు తప్పాయని పలువురు పేర్కొన్నారు.
మొత్తానికి, ఆదివారం అరకులోయ పర్యటన ఒకవైపు దుఃఖముతో కూడిన ఆనందాన్ని ఇచ్చినా, మరోవైపు రద్దీతో కూడిన అనుభవంగా మారింది. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా పర్యాటక నిర్వహణపై మరింత ప్రణాళిక అవసరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


