Dindi bus Stand : డిండి బస్టాండ్ లో దారి మూసిన సిబ్బంది

TRINETHRAM NEWS

డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. డిండి బస్టాండ్ లో బస్సులు దిగి కాలనీకి వెళ్లే దారి నీ గుంత తీసి పెద్దపెద్ద బండరాళ్లు ప్రజలు బయటకి వెళ్లకుండా దారికి అడ్డంగా వేసిన డిండి బస్టాండ్ సిబ్బంది.

ప్రజల రాకపోకులకు చాలా ఇబ్బందిగా ఉందని. కాలనీ కి వెళ్లాలంటే చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బస్టాండ్ నిర్మించింది ప్రజల కోసమా? లేక కొంతమంది స్వార్థపర అధికారుల కోసమా లేక సిబ్బంది కోసం ప్రజలు ప్రయాణం చేస్తేనే కదా ఆర్టీసీకి ఆదాయం వచ్చేది, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే ఎలా? కొంతమంది అధికారులు తమ స్వ ప్రయోజనాల కోసం ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు, ఇలా అయితే వ్యవస్థ నడుస్తోందా? ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రజలకు ఇబ్బంది కలవకుండా ఏ సమస్యలు రాకుండా మూసివేసిన దారిని బండరాలను తొలగించి ఆ గుంతలను చదును చేసి ప్రజలు కాలనీవాసులు ఇబ్బందికి గురికాకుండా చూస్తారని డిండి ప్రజలు కాలనీవాసులు, సంబంధిత అధికారులను కోరుతున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Dindi bus stand

You cannot copy content of this page

Scroll to Top