
AP Government : గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం. పెనుమూరు (త్రినేత్రం న్యూస్ )జూన్ 17.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఉగ్రాణం పల్లె నందు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక సాంస్కృతిక సమితి, భాషా సాంస్కృతిక సౌజన్యం తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం…ప్రియాంక యువతి మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన డా.పద్మశ్రీ SP బాలసుబ్రమణ్యం జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ సందర్బంగా చంద్రశేఖర్ రెడ్డి మరియు వారి బృందం మిమిక్రి మరియు గాన కచేరితో అద్భుతంగా విద్యార్థులను మరియు గ్రామస్తులను అలరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పెనుమూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పి.రుద్రయ్య నాయుడు హాజరై విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి శ్రీదేవి మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe