జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Solve drinking water problem

Solve Drinking Water Problem : గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం. పెనుమూరు (త్రినేత్రం న్యూస్ )జూన్ 17.పెనుమూరు మండలం కామచిన్నయ్యపల్లి పంచాయతీ పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో తాగునీటి సమస్య ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఈ సమస్య పరిష్కారం కోసం స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం. థామస్ కృషి చేసి ప్రభుత్వ నిధులను మంజూరు చేయించడంతో గ్రామంలోని తాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది.అయితే ఇటీవల బోరుబావి మోటారుకు విద్యుత్ సరఫరా చేసే తీగలను గుర్తుతెలియని దుండగులు కత్తిరించి తీసుకెళ్లడం ఆందోళనకు గురిచేసింది
దీని కారణంగా గ్రామంలోని దళితవాడల ప్రజలు తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించి గ్రామానికి తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page