జూన్ 26, 2026
TRINETHRAM NEWS
ZPHS Study Center sets a new record

-87 శాతం ఉత్తీర్ణతతోబీ విజయకేతనం ఎగరేసిన విద్యార్థులు -హాజరైన 47 మందిలో 41 మంది పాస్ –విద్యార్థులను, ఉపాధ్యాయ బృందాన్ని అభినందించిన జీహెచ్ఏం ఇస్లావత్ గోప్య నాయక్

ZPHS : డిండి (గుండ్ల పల్లి) మే 30: త్రినేత్రం న్యూస్ . తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) శనివారం విడుదల చేసిన 10వ తరగతి ఫలితాల్లో నల్గొండ జిల్లా గుండ్లపల్లి మండల పరిధిలోని స్థానిక జెడ్‌పీహెచ్‌ఎస్ చెరుకుపల్లి స్టడీ సెంటర్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి విజయదుందుభి మోగించారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓపెన్ స్కూల్ విద్యార్థులు సాధించిన ఈ ఘన విజయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ మేరకు స్టడీ సెంటర్ కోఆర్డినేటర్, జెడ్‌పీహెచ్‌ఎస్ చెరుకుపల్లి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు (GHM) ఇస్లావత్ గోప్య నాయక్ శనివారం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఫలితాల వివరాలను అధికారికంగా వెల్లడించారు.

ప్రతిభా పాటవాల వివరాలు:

ఈ విద్యాసంవత్సరంలో చెరుకుపల్లి కేంద్రం నుండి అత్యధిక మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి పట్టుదలను నిరూపించుకున్నారని జీహెచ్ఏం తెలిపారు. ఫలితాల గణాంకాలు ఇలా ఉన్నాయి:

మొత్తం పరీక్షకు హాజరైన విద్యార్థులు: 47 మంది

విజయవంతంగా ఉత్తీర్ణత సాధించిన వారు: 41 మంది

మొత్తం ఉత్తీర్ణత శాతం: 87%

ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదలకు దక్కిన ఫలితం..

ఈ సందర్భంగా జీహెచ్ఏం గోప్య నాయక్ మాట్లాడారు ,..2025-26 విద్యా సంవత్సరానికి గాను తమ స్టడీ సెంటర్ నుండి పరీక్షలు రాసిన విద్యార్థులు వివిధ పనుల ఒత్తిడిలో ఉంటూనే, క్రమశిక్షణతో కష్టపడి చదివి ఈ అత్యుత్తమ ఫలితాలు సాధించారని కొనియాడారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ, వారి సందేహాలను నివృత్తి చేసి, ఇంతటి ఘన విజయానికి వెన్నుముకగా నిలిచిన ఉపాధ్యాయ బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

–పాఠశాలలో మిఠాయిలు పంచి సంబరాలు:—

ఫలితాలు విడుదలైన అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో TOSS అసిస్టెంట్ కోఆర్డినేటర్ టి. వేణు, ఉపాధ్యాయులు ముడి శ్రీనయ్య, నాగేశ్వరరావు, వింజమూరి శ్రీనయ్య, ఎం. శ్రీనివాస్ తదితరులు పాల్గొని విద్యార్థులకు మిఠాయిలు తినిపించి, వారి ఉజ్వల భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఈ స్టడీ సెంటర్ 87% ఉత్తీర్ణత సాధించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ పాఠశాల సిబ్బందిని అభినందించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page