Amaravati Permanent Capital : అమరావతి ఆంధ్ర ప్రదేశ్ కు శాశ్వత రాజధాని

TRINETHRAM NEWS
Amaravati permanent capital of Andhra Pradesh

భవిష్యత్తులోను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం…

రాష్ట్రం పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల జగన్ కు ఏమాత్రం అవగాహన లేదు…

కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు

Amaravati Permanent Capital : త్రినేత్రం న్యూస్ : ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సవరణ చట్టం లోక్ సభలో ఆమోదం పొందడంతో రాజధాని రైతుల త్యాగాలకు సరైన న్యాయం జరిగిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. వాడపాలెంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. అమరావతి విషయంలో జగన్ విధానాలను తూర్పారబట్టారు. ప్రపంచంలో ఎక్కడైనా రాజధాని అవసరం లేదన్న నాయకుడు ఉన్నాడా?

అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఉన్న నమ్మకంతో రాజధానికి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా వేల మంది రైతులు స్వచ్ఛందంగా భూమిని అందించారని, వైసిపి హయాంలో పాడు పెట్టకుండా ఆ భూమిని అభివృద్ధి చేసి ఉంటే ఎన్నో కంపెనీలు వచ్చే ఉండేవని, యువతకు ఉపాధి దక్కేదన్నారు. నాడు రాష్ట్రానికి బంగారు బాతులాంటి అమరావతిని చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

మరలా ఆ రాజధానికి పునరుద్ధరణ చేసి అభివృద్ధి చేస్తుంటే పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవ చేశారు. జగన్ మాటలు వింటుంటే అతన్ని అర్జెంటుగా మానసిక వైద్యులకు చూపించాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో పొరపాటున పిచ్చి తుగ్లక్ లు ఎవరు వచ్చినా అమరావతికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరింత పటిష్టమైన చట్టబద్ధత కల్పించాలని మల్టీ నేషనల్ కంపెనీలు సైతం కోరుతున్నాయని దానికి తగినట్లుగా నేడు బిల్లు పాస్ అయిందన్నారు. రాజధాని మరలా మార్చలేమా? అసెంబ్లీలో తీర్మానం పెట్టలేమా?

అంటూ జగన్ మాట్లాడుతున్నారని, జగన్ కు అసలు రాష్ట్ర ప్రజల పట్ల, అభివృద్ధి పట్ల ఏమాత్రం అయినా బాధ్యత ఉందా? అని ప్రశ్నించారు. మావిగన్ పెట్టాలని ఏదేదో పనికిమాలిన ప్రతిపాదనలు తేవడం చూస్తుంటే ఇక భవిష్యత్తులో ఎన్నటికీ అధికారంలోకి రాలేమని, ప్రజలు అధికారంలోకి రానివ్వరని తెలిసి మతిభ్రమించి ఈ విధంగా మాట్లాడుతున్నారని అర్థమవుతుందన్నారు. డబల్ ఇంజన్ సర్కార్ నేతృత్వంలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల సారధ్యంలో అమరావతిలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, 16 జాతీయ సంస్థలకు శంకుస్థాపన జరిగి హడ్కో,కాగ్, పోస్టల్ వంటి కేంద్ర సంస్థలు ఏర్పాటు అవుతున్నాయని తెలిపారు.

రేపు రాజ్యసభలో అమరావతి చట్ట సవరణ బిల్లు పాసయ్యాక రాష్ట్రపతి సంతకం చేసి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశాక అమరావతిని ఎవ్వరూ కదల్చలేరని తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుందని అమరావతి శాశ్వత రాజధాని అని నొక్కి వక్కాణించారు. భవిష్యత్తులో సైతం కూటమి ప్రభుత్వం మరలా మరలా అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ప్రజలకు ఇప్పటికే వైసీపీ విధానాలు అర్థమయ్యే అని గత చేదు అనుభవాల్ని వారు ఎన్నటికీ మర్చిపోరన్నారు.ఈ కార్యక్రమంలో కంఠంశెట్టి శ్రీనివాస్, బూసి భాస్కరరావు, చికరమేల్లి లవరాజు మరియు కడలి భీమేశ్వరరావు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top