MLA Bandaru Satyananda Rao : తిరుమల తరువాత తిరుమలలా వాడపల్లి వైభవం

TRINETHRAM NEWS

లక్షలాదిగా భక్తులు తరలివస్తున్న వాడపల్లి అభివృద్ధికి చేయూతనందించండి…..

దేవాదాయశాఖామంత్రి ఆనంతో చర్చించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు విజ్ఞప్తి….

పలు అభివృద్ధి పనులకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కోరిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు….

త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 21, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి అవసరమైన పనులు మంజూరు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కోరారు. మంగళవారం తాడేపల్లి లోని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి క్యాంప్ ఆఫీసులో ఆయనను కలుసుకొని పలు అంశాలపై చర్చించారు. తిరుమల తరువాత తిరుమలలా వాడపల్లి అభివృద్ధి చెందుతుందని ఆయన మంత్రి ఆనంకు తెలియజేశారు. ఏడు శనివారాల వెంకన్న దర్శనంతో ఆలయం శనివారం ఇల వైకుంఠాన్ని తలపిస్తుందని తెలిపారు.

ఈ మధ్య ముగిసిన 13వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి ఆయనకు వివరించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్న విషయాన్ని తెలియజేశారు. శనివారంతో పాటు మిగిలిన రోజుల్లోనూ భక్తుల రద్దీ అధికంగా ఉంటుందన్నారు.ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వెల్లువలా తరలివస్తున్న భక్తుల సౌకర్యార్థం ఇప్పటికే జరుగుతున్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయడంతో పాటు, వాడపల్లిలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరంఉందన్నారు.

ఇందుకోసం దేవాదాయ శాఖ నుంచి అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని కోరారు. వాడపల్లి ఆలయ విశిష్టతను పురస్కరించుకొని స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయనకు ఆహ్వానం పలికారు. స్వామి వారి ప్రసాదం ఆయనకు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు,ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరావు, మైగపుల గురవయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

the glory of Vadapalli is like Tirumala

You cannot copy content of this page

Scroll to Top