
Sarpanch Satish Chandra Stalin : త్రినేత్రం న్యూస్, న్యాయవాదులకు మెరుగైన వసతులు కల్పించాలనే లక్ష్యంతో నిర్మాణంలో ఉన్న రాజమండ్రి బార్ అసోసియేషన్ నూతన భవనానికి జేగురుపాడు గ్రామ సర్పంచ్ మరియు న్యాయవాది వై. సతీష్ చంద్ర స్టాలిన్, తన వంతు సహకారంగా రూ.1,11,111/- విరాళం అందజేశారు.
సమాజ సేవ పట్ల నిబద్ధతతో ముందుండే సతీష్ చంద్ర స్టాలిన్ ఈ ఔదార్యం, న్యాయవాద వృత్తి పట్ల ఆయనకు ఉన్న గౌరవాన్ని ప్రతిబింబిస్తోందని బార్ అసోసియేషన్ బిల్డింగ్ కమిటీ సభ్యులు కొనియాడారు.
ఈ సందర్భంగా బిల్డింగ్ కమిటీ చైర్మన్ సి. హెచ్. ప్రభాకర్, ట్రెజరర్ వై.వి.ఎస్. శ్యామల, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సి. హెచ్. వి. ప్రసాద్, సెక్రటరీ పెల్లూరి రమేష్ తదితరులు సతీష్ చంద్ర స్టాలిన్,కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా సతీష్ చంద్ర స్టాలిన్ మాట్లాడుతూ, సమాజంలోని ప్రతి వర్గం ఇలాంటి నిర్మాణాత్మక కార్యక్రమాలకు ముందుకు వచ్చి సహకరించాలని పిలుపునిచ్చారు. నూతన బార్ అసోసియేషన్ భవనం పూర్తయిన తరువాత న్యాయవాదులకు ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చి, న్యాయ సేవలు మరింత సమర్థవంతంగా ప్రజలకు అందే అవకాశం ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

