International Women’s Day : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అల్లూరి జిల్లా పోలీస్ వారోత్సవాలు

TRINETHRAM NEWS

అరకువేలిలో భారీ అవగాహన ర్యాలీ

అరకులోయ, మార్చి 2, (త్రినేత్రం న్యూస్): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా అరకువేలిలో మహిళల హక్కులు, చట్టపరమైన రక్షణలపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, పర్యాటకులు, పోలీస్ సిబ్బంది భారీ ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు.
ర్యాలీ స్థానిక పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమై నాలుగు రోడ్లు జంక్షన్ వరకు సాగింది. “శ్రీ శక్తి భారతదేశ భవిష్యత్తు”, “ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు” వంటి నినాదాలతో మహిళా శక్తిని ప్రతిబింబిస్తూ ముందుకు కదిలింది. నాలుగు రోడ్లు జంక్షన్ వద్ద మానవహారంగా నిలబడి మహిళా సాధికారతపై శ్లోకాలు, నినాదాలు వినిపించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పాడేరు డీఎస్పీ అభిషేక్ మాట్లాడుతూ స్త్రీలకు చట్టంలో కల్పించిన హక్కులు, రక్షణల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మహిళల భద్రత, గౌరవం కోసం పోలీస్ శాఖ కట్టుబడి ఉందని, వారోత్సవాల సందర్భంగా వారం రోజుల పాటు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.
అరకువేలి ఎస్ఐ జి. గోపాల్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో మహిళలు, యువతులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మహిళలపై జరిగే అన్యాయాలను ఎదుర్కొనేందుకు చట్టపరమైన రక్షణలు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు.
మహిళా సాధికారతకు బాటలు వేసే ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో చైతన్యాన్ని పెంపొందిస్తాయని పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

the Occasion of International Women's Day

You cannot copy content of this page

Scroll to Top