త్రినేత్రం న్యూస్. మహిళా సాధికారత వారోత్సవాలలో భాగంగా 7వ రోజున “మహిళా స్పూర్తిదాయ కమైన సినిమాల ప్రదర్శన” చేసిన చిత్తూరు జిల్లా పోలీసులు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ వి.ఎన్. మణికంఠ చందోలు, IPS నేతృత్వంలో చిత్తూరు మహిళా డి.ఎస్పీ శ్రీ ఎస్. విజయశేఖర్ పర్యవేక్షణలో “మహిళా సాధికారత వారోత్సవాలు” ఘనంగా నిర్వహిస్తున్న చిత్తూరు జిల్లా పోలీసులు.
చిత్తూరు జిల్లాలోని స్కూల్స్ మరియు కాలేజీలలో విద్యార్థినులకు “మహిళా స్పూర్తిదాయకమైన సినిమాల ప్రదర్శన చేసారు.
ఈ కార్యక్రమం విద్యార్థినులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, మహిళా సాధికారితపై అవగాహన పెంచడం లక్ష్యంగా నిర్వహించారు. ఈ చిత్రాల ద్వారా మహిళలు సమాజంలో ఎదుర్కొనే సవాళ్లు, వారి విజయగాధలు, పట్టుదల, శక్తి, సామర్థ్యాలను విద్యార్థినులకు తెలియజేయడం జరిగింది. విద్యార్థినులు ఈ చిత్రాలను ఆసక్తిగా వీక్షించారు. ఈ చిత్రాల ప్రదర్శన ద్వారా విద్యార్థినులు తమ లక్ష్యాలను సాధించేందుకు దోహద పడుతుంది. మహిళా సాధికారితకు, సమానత్వానికి సంబంధించిన సందేశాలను ఈ చిత్రాల ద్వారా విద్యార్థినులు సులభంగా గ్రహించారు.
మార్చి 8వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఈ తరహా కార్యక్రమాలు మహిళలకు శక్తిని, మానసిక స్థైర్యాన్ని, స్వీయరక్షణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి దోహదపడతాయని జిల్లా ఎస్పీ శ్రీ వి.ఎన్.మణికంఠ చందోలు, ఐపీఎస్., తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


