Mon. Mar 9th, 2026

Model Talent Test : అరకు వ్యాలీ లో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు మోడల్ టాలెంట్ టెస్ట్

TRINETHRAM NEWS

అరకులోయ మార్చి 2, (త్రినేత్రం న్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి మండల పరిధిలో 10వ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మోడల్ టాలెంట్ టెస్ట్ విజయవంతంగా నిర్వహించారు. సీఏహెచ్ స్కూల్‌ను కేంద్రంగా ఏర్పాట్లు చేసి పరీక్ష నిర్వహించారు.
ఈ టాలెంట్ టెస్ట్‌లో సీఏహెచ్ స్కూల్,ఏపీఆర్ స్కూల్, బాలికల ఆశ్రమ పాఠశాల కంటబౌసుగూడ, బాలుర ఆశ్రమ పాఠశాల రవ్వలగూడకు చెందిన ఆసక్తి గల విద్యార్థులు పాల్గొన్నారు. పరీక్ష నిర్వహణకు ఎస్‌ఎఫ్‌ఐ మండల కమిటీ సమగ్ర ఏర్పాట్లు చేసింది.
ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి టీ. ప్రేమ్ సాగర్ మాట్లాడుతూ, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా టాలెంట్ టెస్టులు నిర్వహిస్తున్నామని తెలిపారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలపై విద్యార్థుల్లో ఉన్న భయాన్ని తొలగించి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం ఈ టాలెంట్ టెస్ట్ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులై తమ పాఠశాలలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
మండల పరిధిలో నిర్వహించిన ఈ టాలెంట్ టెస్ట్‌కు విద్యార్థుల నుండి మంచి స్పందన లభించిందని, పరీక్షను విజయవంతం చేసినందుకు పాల్గొన్న విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్షుడు చందు, ఉపాధ్యక్షుడు ఎస్. ఈసుబాబు, మండల కమిటీ సభ్యులు రమాదేవి, రిషి తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Model Talent Test for 10th Class Students

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page