త్రినేత్రం న్యూస్ వరంగల్ జిల్లా ప్రతినిధి… రేపు జరగబోయే ర్యాలీ లో ఉద్యోగుల అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చిన ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసఫ్. ఈ సందర్భంగా ఎండి యూసఫ్ మాట్లాడుతూ… వరంగల్ సీకేఎం హాస్పిటల్ నుంచి ఉదయం 10 గంటలకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని ఇట్టి ర్యాలీకి ఉద్యోగుల అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలియజేశారు.
తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర 4వ మహాసభను జయప్రదం చేయాలని, ఈ సందర్భంగా వాల్ పోస్టర్ విడుదల చేసిన తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.నరసింహ..
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్షులు కందిక చెన్నకేశవులు , వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నారపు రమేష్, జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటియుసి అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా , ఎన్ హెచ్ ఎం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఆచంట అభిషేక్ ,దేశబోయిన స్వప్న ,మరియు తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఎంజీఎం, సికేం ఆస్పత్రి సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


