ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ డిమాండ్…
త్రినేత్రం న్యూస్, కాకినాడ,ఆగస్టు,25: ఏపీ మెడికల్ ఎంప్లాయి కాంట్రాక్ట్ అండ్ సెక్యూరిటీ గార్డ్ వర్కర్స్ యూనియన్,ఏఐటీయూసీ అనుబంధ సంఘం అధ్యక్షులు కె.వి రామయ్య అధ్యక్షతన సోమవారం ఉదయం ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డ్ వస్త్ర కార్యాలయం వద్ద యూనియన్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తోకల ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న కార్మికులకు జీవో ప్రకారంగా జీతాలు మంజూరు చేయాలని, సెక్యూరిటీ గార్డ్ సర్వీసింగ్ గుర్తించాలని, సెక్యూరిటీ గార్డ్ సమస్యలపై నిరంతరం శ్రమిస్తు వారి సమస్యలపై స్పందించే ఏకైక యూనియన్ ఏఐటియుసి అని, ఆయన అన్నారు.
రోజురోజుకు పెరుగుతున్న నిత్యవసర అధిక ధరలకు అనుగుణంగా 16 వేల 400 రూపాయలు జీతాలు పెంచి మంజూరు చేయాలని, పి.ఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా చెల్లించాలని, సీయల్స్ వర్తింపచేయాలని ఆయన అన్నారు. సెక్యూరిటీ గార్డ్ అనారోగ్యానికి గురైతే సెలవులతో కూడిన వేతనం మంజూరు చేయాలని, కాంట్రాక్టర్ వారిని ఆదుకోవాలని, ఆయన అన్నారు. ఈనెల ఆకారున్న ఏపీ మెడికల్ ఎంప్లాయి కాంట్రాక్ట్ అండ్ సీక్రెట్ గాడ్ వర్కర్స్ యూనియన్ మహాసభ జరగనని, సెక్యూరిటీ గార్డ్స్ జీతాలు పెంచేందుకు, సీయల్స్ అమలు చేసే వరకు ఉద్యమం ఆగదని, మహాసభ అనంతరం భవిష్యత్తు ఉద్యమ కార్యచరణ వెల్లడిస్తామని ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎన్ అనిల్ కుమార్,మధు, జాన్ బాబు, వెంకటేష్, రమణ లక్ష్మి పార్వతి కుమారి తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


