జూన్ 26, 2026
TRINETHRAM NEWS

తేదీ : 31/05/2025. నెల్లూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఏ యస్ పేట మండలం , జమ్మవరం గ్రామ సచివాలయం పై ఏసీబీ అధికారులు తనిఖీ చేయడం జరిగింది. అయితే కాకర్లపాడు గ్రామానికి చెందిన అశోక్ కుమార్ కు సంబంధించిన ఎకరం డెబ్బై సెంట్లు భూమికి పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసుకున్న అశోక్ కుమార్ కు పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేసి ఇచ్చేందుకు రూపాయలు పదిహేను వేలు వీఆర్వో గంగాధర్ డిమాండ్ చేయడం జరిగింది.

ఈ క్రమంలో లంచం ఇచ్చేంత స్తోమత లేకపోవడంతో ఏసీబీ ని ఆశ్రమించాడు. దీంతో రంగంలోకి దిగి సంబంధిత అధికారులు పక్క ప్రణాళికతో అశోక్ కుమార్ వద్దనుండి డబ్బులు తీసుకుంటుండగా వీఆర్వో గంగాధర్ ను రెడ్ హ్యాండ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

ACB caught VRO taking

You cannot copy content of this page