Journalists Flock : తెలంగాణ రజతోత్సవ వేడుకలకు తరలి వెళ్లిన కూకట్పల్లి జర్నలిస్టులు

TRINETHRAM NEWS

కూకట్ పల్లి త్రినేత్రం న్యూస్ మే 31 : తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం రజతోత్సవ వేడుకలను పురస్కరించుకొని నగరంలోని జలవిహార్ లో నిర్వహించిన కార్యక్రమానికి కూకట్ పల్లి జోన్ నుంచి జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. కూకట్ పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్ , ప్రధాన కార్యదర్శి కోహీర్ నాగరాజ్ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్కే దయాసాగర్ ల ఆధ్వర్యంలో కూకట్ పల్లి చిత్తరమ్మ ఆలయం నుంచి బస్సులో జలవిహార్ కుచేరుకున్నారు. ”తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు ” నినాదంతో గత 25 సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం స్వరాష్ట్ర సాధన ఆకాంక్షను నెరవేర్చడానికి సబ్బండ వర్గాలను, సకల జనులను, రాజకీయ పార్టీలను ప్రజాసంఘాలను ఏకతాటి పైకి తీసుకొచ్చిన ఘనత తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంకే దక్కుతుందని కష్ట ప్రెసిడెంట్ నిమ్మల శ్రీనివాస్ , ఆర్కె దయాసాగర్ పేర్కొన్నారు.

అక్షరాలను ఆయుదంగా మలిచి నాటి నుంచి తెలంగాణ కోసం పరితపించిన తెలంగాణ కలం యోధుడు అల్లం నారాయణ నేతృత్వంలో పురుడు పోసుకున్న తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం తెలంగాణ మనుగడ సాగించినంత కాలం తెలంగాణ మలిదశ ఉద్యమానికి తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం చేసిన తెలంగాణ అక్షర కలం కవాతు,అక్షర పోరు సువర్ణ అక్షరాలతో లిఖించబడి ఉంటుందని అన్నారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పాలకులపై ఒత్తిడి పెంచి పరిష్కరించేందుకు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం నాటి ఉద్యమ తరహాలో పోరాడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సదా మహేష్, భాస్కర్ చారి, కైలాష్, తెల్ల హరికృష్ణ, మహేందర్ నాయక్,రహిమాన్, హరికుమార్, బలరాం, రాజు యాదవ్, షబ్బీర్, నరేష్ సిటీ టైమ్స్, నాగమణి, ప్రవీణ్, శ్రీనివాస్ రెడ్డి, శ్రావణ్, నాగరాజు, ఆర్కే పటేల్, మనోహర్, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Kukatpally journalists flock to

You cannot copy content of this page

Scroll to Top