
Bonalu Festival : త్రినేత్రం న్యూస్ : Jul 16, 2026, తెలంగాణలో ఆషాఢ మాసం బోనాల జాతర జులై 16వ తేదీ నుంచి అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలిసిన జగదాంబిక ఎల్లమ్మ మహంకాళి ఆలయంలో జరిగే తొలిపూజతో ఈ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా మొదలవుతాయి.
ప్రభుత్వం తరపున మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ఉదయం లంగర్‌హౌస్‌లో ఈ ఉత్సవాలను ప్రారంభిస్తారు. అనంతరం, పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లతో తొట్టెలను గోల్కొండ కోటలోని అమ్మవారి ఆలయానికి సమర్పిస్తారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe