ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
Bandi Ramesh Birthday Celebrations

Bandi Ramesh : కూకట్పల్లి జులై 15 (త్రినేత్రం న్యూస్) : టీపీసీసీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ ఖమ్మ కార్పొరేషన్ చైర్మన్, కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి, ప్రజా నాయకుడు బండి రమేష్ జన్మదిన వేడుకలను బుధవారం బాలానగర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు పులి శివకుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కూకట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కె. పుష్పారెడ్డి, మేడ్చల్–మల్కాజ్‌గిరి డీసీసీ ఉపాధ్యక్షుడు పులి శ్రీకాంత్ పటేల్, జిల్లా అధికార ప్రతినిధి మధుమోహన్ తదితరులు హాజరై కేక్ కట్ చేసి బండి రమేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పులి శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ, బండి రమేష్ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొన్న నాయకుడిగా గుర్తింపు పొందారని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆయన అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డివిజన్ మహిళా అధ్యక్షులు రేణుక, సాయి భారతి, సుగుణ, ఊర్మిళ్ల, పద్మావతి, శ్వేతా, ఇందిరా, కూకట్పల్లి కోఆర్డినేటర్ గజానంద్ శేఖర్, శ్రీకాంత్ గౌడ్, రవి ముదిరాజ్, దండు రవి గౌడ్, కుమార్, జల శివ, సత్యపాల్ రెడ్డి, రామ్మోహన్ రావు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page