జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Request to sanction a new 20 KL water tank

Request to Sanction : చింత పల్లి జూన్17, త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండలంలోని తీదేడు గ్రామంలో మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న తాగునీరు గ్రామ ప్రజల అవసరాలకు సరిపడా అందడం లేదని, గ్రామంలో పెరుగుతున్న జనాభా దృష్ట్యా అదనంగా 20 కే ఎల్ సామర్థ్యం గల నూతన వాటర్ ట్యాంక్‌ను మంజూరు చేయాలని దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ కి తీదేడు గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి మాట్లాడారు…ప్రస్తుతం గ్రామ ప్రజలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారని, వేసవి కాలంలో నీటి అవసరాలు మరింత పెరుగుతున్నాయని తెలిపారు.గ్రామ ప్రజలకు నిరంతరాయంగా మరియు సరిపడా తాగునీరు అందించేందుకు అదనంగా 20 కే ఎల్ వాటర్ ట్యాంక్ అత్యవసరమని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇడబోయిన వెంకటయ్య యాదవ్, మాజీ ఉప సర్పంచ్లు ఉలుపాల శేఖరరెడ్డి,ధరణిపతిరమణారావు,వార్డు సభ్యులు బొడ్డు పార్వతమ్మ యాదగిరి, మాదగోని కృష్ణ గౌడ్, గంటెల అలివేలు సోమయ్య,దాసరి కళమ్మ ముత్తయ్య,రెడ్డి పద్మ పరమేష్, శివర్ల పర్వతాలు యాదవ్,బిఆర్ఎస్ నాయకులుమర్రురామారావు, సిమర్లశ్రీనుయాదవ్,మెరికశంకరయ్య,సందెదేవయ్య,తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page