డిండి (గుండ్ల పల్లి) త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో మంచినీటి సమస్య చాలా ఉంది . కొన్ని రోజులుగా మంచినీటి సరఫరా సరిగా లేనందున ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ మంచినీటి సరఫరా గురించి , పరిష్కరించాలని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో డీ , మిషన్ భగీరథ ఏ ఈ మరియు
RWS AE గార్లతో చర్చించి సమస్య పై వివరించడం జరిగింది. అధికారులు స్పందిస్తూ 3 రోజులలో సమస్య ను పూర్తిగా పరిష్కారం చేస్తామని డిండి గ్రామం లొ 5 లక్షల లీటర్ల తాగు నీరు అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ డిండి పట్టణ అధ్యక్షులు గిరమోని శ్రీనివాస్, బిజెపి పార్టీ అసెంబ్లీ కన్వీనర్ ఏ టి కృష్ణ, నల్లగంతుల రవి, కర్ణాకర్ సైదా శ్రీశైలం , అంజి యాదవ్, బాసిద్ తది తరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


