జూలై 16, 2026
TRINETHRAM NEWS
MLC Kumbha Ravibabu

MLC Kumbha Ravibabu : అరకులోయ,జూన్ 26, (త్రినేత్రంన్యూస్): పర్యాటక ప్రాంతం అయినటువంటి బొర్రా గుహల అభివృద్ధి పనుల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 109 మంది గిరిజన వ్యాపారుల షాపులను తొలగించకుండా యథావిధిగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ డా. కుంభా రవిబాబు అధికారులను కోరారు. రూ.30 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులో కేవలం 38 షాపులకు మాత్రమే స్థానం కల్పించడంపై గిరిజన వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజనుల జీవనోపాధికి భంగం కలగకుండా డీపీఆర్‌ను సవరించి అందరికీ షాపులు కేటాయించాలని ఎమ్మెల్సీ కుంభ రవిబాబు డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారానికి అధికారులతో మాట్లాడిన ఆయన,

ఈ సమస్యపై స్పందించకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అలాగే బొర్ర గుహల ప్రవేశ రుసుము, జిప్‌లైన్ ఆదాయంలో గ్రామ పంచాయతీ వాటా చెల్లించాలని, పెండింగ్ నిధులు విడుదల చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, బొర్రా మాజీ సర్పంచ్ జన్ని అప్పారావు, నాయకులు సుభాష్ చంద్ర, గుడివాడ ప్రకాశ్ రావు, వంతాల గురు నాయుడు, నానిబాబుతో పాటు బొర్రా వర్తక సంఘం సభ్యులు, గ్రామ పంచాయితీ పెద్దలు, స్థానిక నాయకులు, పంచాయితీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page