జూలై 16, 2026
TRINETHRAM NEWS
Grand Welcome

Grand Welcome : అరకులోయ,జూన్ 26, (త్రినేత్రం న్యూస్) : అరకు పార్లమెంట్ సభ్యురాలు తనూజా రాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్లమెంట్ క్యాంపు కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ డా. కుంభా రవిబాబుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, మరియు గుడివాడ ప్రకాష్ రావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఎమ్మెల్సీకి పుష్పగుచ్ఛాలు అందజేసి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.
అనంతరం కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కుంభా రవిబాబు పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారానికి కార్యాలయం కేంద్రంగా పనిచేయాలని ఆకాంక్షించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page