ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
Permission from one place

Permission : ఎన్టీఆర్ జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూన్ 06; ఎ.కొండూరు మండలం పోలిశెట్టిపాడు ఎర్రచెరువులో మట్టి అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. అనుమతి ఒకచోటికి తరలించేది మరోచోటకి. చెరువు నుంచి భారీగా మట్టిని తవ్వి వ్యాపార అవసరాలకు తరలిస్తున్న అక్రమ దారులను పట్టుకునేది ఎవరు ? అని ప్రజలు ప్రశ్ని స్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ మట్టి విక్రయాల ద్వారా లక్షల రూపాయలు ఆర్జిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. చెరువు పరిరక్షణకు ముప్పు వాటిల్లుతుందని రైతులు ఆందోళన దిగే పరిస్థితిలో ఉన్నారు.

తవ్వకాలపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా స్పందించకపోవడం సంబంధిత అధికారులకు సిగ్గు చేటు. మట్టి తరలింపును అడ్డుకోవాలని రైతులు, గ్రామస్థుల డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. అక్రమ మట్టి తవ్వకాల వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతుల డిమాండ్. ప్రజల అభ్యంతరాలను పట్టించుకోకుండా కొనసాగుతున్న మట్టి దందాపై వాళ్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page