జూలై 23, 2026
TRINETHRAM NEWS
CPMG B.P. Sridevi visited post office

CPMG B.P. Sridevi : అరకులోయ ,జూన్ 7, (త్రినేత్రం న్యూస్) : అరకులోయ మండలంలోని సుంకరమెట్ట పంచాయతీ కేంద్రంలో ఉన్న శాఖ తపాలా కార్యాలయం ను శనివారం ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ( సి పి ఎం జి ) బి పి శ్రీదేవి, విశాఖపట్నం రీజినల్ పోస్ట్ మాస్టర్ జనరల్ వి ఎస్ జయశంకర్ తో కలసి సందర్శించారు. అల్లూరి జిల్లా పర్యటనలో భాగంగా అరకలోయకు విచ్చేసిన ఆమె ముందుగా సుంకరమెట్ట శాఖాతపాల కార్యాలయమును సందర్శించి , అక్కడ అందిస్తున్న సేవలపై ఆరా తీశారు .

అలాగే రికార్డులను పరిశీలించి వివరాలను సేకరించారు. అనంతరం సి పి ఎం జి అరకలోయకు చేరుకొని స్థానిక అక్షయ ఇన్ సమావేశ మందిరంలో పోస్టల్ పథకాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జి బి శ్రీదేవి మాట్లాడుతూ ప్రజల ఆర్థిక శ్రేయస్సును కోరుతూ రిస్క్ లేని స్థిరమైన, ఆకర్షణీయమైన రాబిడి కోసం భారత ప్రభుత్వం ఇండియా పోస్ట్ ద్వారా అనేక చిన్న పొదుపు పథకాలను అందిస్తోందని తెలియజేశారు. వీటిలో 100 శాతం ప్రభుత్వ భద్రత ఉంటుందని చెప్పారు.

సుకన్య సమృద్ధి యోజన , సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీం, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ , పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ , రికరింగ్ డిపాజిట్, ఎఫ్ డి , మహిళల కోసం ప్రత్యేకంగా అందిస్తున్న మహిళ సమ్మన్ సేవింగ్ సర్టిఫికెట్, పి ఎల్ ఐ తదితర పథకాల గురించి ఈ సందర్భంగా సిపిఎం జి వివరించారు . కాగా అరకులోయ పర్యటనలో భాగంగా సిపిఎంజి బి పి శ్రీదేవి కాసేపు దింస్సా కళాకారులు ప్రదర్శించిన దింస్సా నృత్యం లో పాల్గొన్నారు.

అంతకుముందు సుంకరమెట్ట చేరుకున్న సి పి ఎం జి బిపి శ్రీదేవి, పోస్టుమాస్టర్ జనరల్ వి ఎస్ జయ శంకర్ లకు అనకాపల్లి ఎస్ పి ఓ చుక్క శ్రీనివాసరావు, అరకులోయ ఐపిఓ కిషోర్ తమ సిబ్బందితో కలిసి ఘన స్వాగతం పలికారు . ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page