జూన్ 29, 2026
TRINETHRAM NEWS
MLA Interacted with Students

MLA Interacted with Students : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూన్ 06; చింతలపూడి నియోజకవర్గం, మండలం లో డైనమిక్ శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థినిలను తన క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు వారు చదువుతున్న పాఠశాలలో అందిస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన మెను నాణ్యత గురించి మరియు వసతి గృహంలో అందుతున్న సౌకర్యాలు, భోజన వసతులు, విద్యా పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా విద్యార్థుల చదివే నైపుణ్యాలను స్వయంగా పరిశీలించి, మరింత శ్రద్ధగా చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని వాళ్లకు సూచించారు.

విద్యార్థుల సంక్షేమం, విద్యాభివృద్ధిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి పెట్టారని తెలియజేశారు. వాళ్ల సమస్యలు తెలుసుకుని, అవసరమైన చర్యలు తీసుకుంటామని శాసనసభ్యులు హామీ ఇచ్చారు. విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page