Pond Repairs : రైతుల సౌకర్యార్థం చెరువు మరమ్మత్తులు

TRINETHRAM NEWS

Pond repairs for the convenience of farmers

సాంబయ్య పల్లి గర్రపెల్లి బిటి రోడ్డు నిర్మాణానికి కృషి

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు
రైతులకు సక్రమంగా నీరు అందించేందుకు చెరువు మత్తడి మరమ్మత్తులకు కృషి చేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు.

గురువారం రోజున సుల్తానాబాద్ మండలం, గర్రెపల్లి గ్రామంలోని చెరువును రైతుల కోరిక మేరకు రైతులతో మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సందర్శించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు
గర్రెపల్లి చెరువు నుండి నీరు లీక్ అవుతోందని రైతులు సూచించిన దృష్ట్యా మైనర్ ఇరిగేషన్ చెరువు కట్టను అభివృద్ధి పరిచి మత్తడి వద్ద నీరు వృధా పోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టి సిసి నిర్మాణం చేపడతామని అన్నారు త్వరలో సాంబయ్యపల్లి గొల్లపల్లి నుండి గర్రెపల్లి వరకు చెరువు కట్టను అభివృద్ధిపరిచి అద్భుతమైన బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టి ప్రజలు రాకపోకలు సాగించే విధంగా దశలవారీగా నిధులు కేటాయించి పనులు చేపడతామని సూచించారు.

రాకపోకలు సాగించే విధంగా కట్టను అభివృద్ధి పరిచి రైతులకు నీరును సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటామన్నారు గతంలో ఉన్న ప్రజా ప్రతినిధులు చెరువు కట్టను పర్యటగా కేంద్రంగా మలుస్తామని అభివృద్ధి పరుస్తామని ఊకదంపుడు ప్రచారాలు చేశారని కేవలం ఓట్ల కోసం ప్రచారాలు చేసి అభివృద్ధిని మరిచారని పేర్కొన్నారు.

అభివృద్ధి పరచడమే గేయంగా పనిచేస్తామని రానున్న రోజుల్లో అద్భుతంగా రహదారులు ఏర్పాటు చేసి ప్రజల సౌకర్యార్థం చర్యలు తీసుకుంటామన్నారు .

ఈ కార్యక్రమంలో SRSP SE, EE, DE,AE కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మినుపాల ప్రకాష్ రావు, సాయిరి మహేందర్, కల్లేపల్లి జానీ, చిలుక సతీష్, పులి అనూష, ఇరిగేషన్ శాఖ అధికారుల తో పాటు రైతులు పలువురు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Pond repairs for the convenience of farmers

You cannot copy content of this page

Scroll to Top