
Dommeti Venkata Reddy : త్రినేత్రం న్యూస్, సంఘ సంస్కర్త,విద్యాదాత, స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి 173.వ జయంతి సందర్భంగా కడియం శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో సోమవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు.స్థానిక శెట్టిబలిజ నాయకుల ఆధ్యర్యంలో గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించి ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు పేషెంట్ లకు పలు రకాలు పండ్లు, రొట్టెలు పంపిణీ చేసారు. అలాగే ప్రధాన రహదారి నందు స్థానికులకు, ప్రయాణికులకు మజ్జిగఅందజేశారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఐక్యతతో అందరూ కలిసి మెలిసి ముందుకు సాగాలని, సంఘం కొరకు ప్రతి ఒక్కరూ పోరాడుతూ, పాటుపడాలన్నారు.స్తోమత లేక విద్యకు దూరమైన బడుగు బలహీన వర్గాల పిల్లలకు పాఠశాల వద్దే భోజనం ఏర్పాట్లు చేసి విద్యను అందించిన విద్యాదాత దొమ్మేటి వెంకటరెడ్డిని స్మరించు కుంటూ, ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన కీర్తిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక శెట్టి బలిజ సంఘ పెద్దలు, అధిక సంఖ్యలో యువకులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

