జూలై 16, 2026
TRINETHRAM NEWS

MLA Narendra Varma Raju invited : త్రినేత్రం న్యూస్ : అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా, అమరావతిలోని శాఖమూరు పార్కులో నూతనంగా ఏర్పాటు చేసిన 58 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజుని ఆహ్వానించారు. పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం చేసిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా, తుళ్లూరు – పెద్దపరిమి రోడ్డులోని శాఖమూరు పార్కులో ఈ భారీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. మార్చి 16వ తేదీ ఉదయం 10 గంటలకు జరిగే ఈ ఆవిష్కరణ మహోత్సవానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ బాపట్ల జిల్లా ఆర్యవైశ్య సంఘం నేతలు ఎమ్మెల్యే ని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు కోళ్ళపూడి వెంకటేశ్వర కుమార్, కమిటీ సభ్యులు కోళ్ళపూడి శివన్నారాయణ, మరియు గాదం శెట్టి వెంకటేశ్వర్ గుప్తా పాల్గొన్నారు

MLA Narendra Varma Raju invited

You cannot copy content of this page