Udayabhanu Inaugurated the Program : త్రినేత్రం న్యూస్ : జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యాలయంలో రక్తదానం, అన్నదానం మరియు పండ్లను మరియు మొక్కల పంపిణీ వంటి సేవ కార్యక్రమాలను జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడాలనే సంకల్పంతో జనసైనికులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారని తెలియజేశారు అలాగే ఆకలి లేని సమాజం కోసం పేదలకు, బాటసారులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాము అని తెలియజేశారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా పలువురికి మొక్కలను, ఆరోగ్యకరమైన పండ్లను పంపిణీ చేసామని అన్నారు.
“సమాజ మార్పు కోసం, ప్రజల గొంతుకగా పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ నేడు 13వ వసంతంలోకి అడుగుపెట్టడం గర్వకారణం అని రాజకీయాల్లో జవాబుదారీతనం, సామాజిక బాధ్యతను పెంచడమే జనసేన లక్ష్యం అని, ఈ ఆవిర్భావ దినోత్సవం కేవలం వేడుక మాత్రమే కాదు అని. ఇది ప్రజలకు సేవ చేసే ప్రతిజ్ఞ అని ఆయన తెలిపారు. ఈ రక్తదానం చేసిన ప్రతి జనసైనికుడికి, వీర మహిళలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జిల్లా నాయకులకు, కార్యకర్తలకు ఉదయభాను ధన్యవాదాలు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర మరియు NTR జిల్లా జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు, విద్యార్థులు పాల్గొన్నారు.


