Potti Sri Ramulu : పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

తేదీ : 16/03/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుడివాడ పట్నం వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల. రాము పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వాసవి చౌక్ సెంటర్లో గల శ్రీరాములు విగ్రహానికి పెద్దలతో కలిసి జోహార్ పొట్టి శ్రీరాములు అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసినటువంటి ఆత్మ త్యాగం తెలుగువారి దృఢ సంకల్పానికి నిదర్శనం అన్నారు.

ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులర్పిస్తూ ఆయన చేసిన తాగాన్ని మనందరం స్మరించుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ గోకవరపు. సునీల్ టిడిపి నాయకులు చేకూరు.

జగన్ మోహన్ రావు, పట్టణ వైశ్య సంఘం అధ్యక్షుడు జవ్వాజి. గంగరాజు ఆర్యవైశ్య కళ్యాణమందిర అధ్యక్షుడు పోకూరి . మోహన్ రావు, కార్యదర్శి తిరువీధి. శ్రీరాములు స్వచ్ఛంద సేవ సంస్థ పెద్దలు దండమూడి. సీతారామస్వామి. అనుబంధం విభాగాల పెద్దలు, నాయకులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Potti Sri Ramulu idol

You cannot copy content of this page

Scroll to Top