రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చిన కూటమి ప్రభుత్వం

TRINETHRAM NEWS

మైలవరం నియోజకవర్గంలో రైతులకు రూ.16.80 కోట్లు జమ.

మూడు విడతల్లో రూ.56.62 కోట్లు అందజేత.

-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు.

వెల్వడంలో మూడవవిడత ‘పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ.’

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 13.03.2026. : రైతు సోదరులకు ఇచ్చిన హామీని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు వెల్లడించారు. మైలవరం నియోజకవర్గంలో అన్నదాతలకు రూ.16.80 కోట్లను ‘పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ’ పథకం కింద మూడో విడత పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు. మైలవరం మండలం వెల్వడం గ్రామంలో ‘పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ’ పథకాన్ని జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ ఐ.ఏ.ఎస్ , మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.

ముందుగా పీఎం మోడీ , సీఎం చంద్రబాబు ప్రసంగాలను వర్చువల్ గా తిలకించారు. రైతన్నల హర్షధ్వానాల నడుమ పూర్తిగా పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగింది. రైతులతో వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఈ సంధర్భంగా స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ “ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక పక్క అభివృద్ధి చేస్తూనే… పేదలు, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తోంది. నేడు పెట్టుబడి సాయం కింద ఒక్కో రైతుకు రూ.6వేలు మూడవ విడతగా అందజేస్తోంది. ఇప్పటికే రెండు విడతలుగా రూ.14వేలు జమచేయగా నేడు ఇస్తున్న రూ.6వేలతో కలిపి, ఒక్కో రైతుకు రూ.20వేలు చెల్లించి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం.

రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ కింద మైలవరం నియోజకవర్గంలో రూ.12.10 కోట్లు రైతుల ఖాతాలో జమ చేస్తుండగా దాదాపు 30,241 మంది రైతులకు లబ్ది కలుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ యోజన కింద మైలవరం నియోజకవర్గంలో రూ.4.70 కోట్లు రైతుల ఖాతాలో జమ, దాదాపు 23,503 మంది రైతులకు లబ్ది చేకూరుతుంది. మొత్తం రూ.16.80 కోట్లు మూడవ విడత కింద చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం కంటే మన కూటమి ప్రభుత్వం అదనంగా సాయం అందజేస్తోంది. రైతుల సంక్షేమం కోసం పెద్దపీట వేస్తోంది. మైలవరం నియోజకవర్గంలో మూడు విడతల్లో రూ.56.62 కోట్లను ఈ పథకం కింద అందజేసినట్లు వెల్లడించారు. రైతు సోదరుల తరపున ప్రధాని మోడీ కి, సీఎం చంద్రబాబు కి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపారు.

మైలవరం నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు కింద ప్రతి నెలా 42 వేల మందికి రూ.18.16 కోట్ల సొమ్ము పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 21 నెలల్లో రూ.381.36 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. తల్లికి వందనం కింద 40 వేల మందికి రూ.60.36 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు. ఆటోడ్రైవర్ల సేవలో పథకం కింద 2,885 మందికి రూ.4.33 కోట్లు మంజూరు చేశామని అన్నారు. ఈ విధంగా ఇప్పటికి మొత్తం రూ.446.05 కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసినట్లు వెల్లడించారు. సూపర్ సిక్స్ హామీలైన ‘స్త్రీ శక్తి’ కింద మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం, దీపం కింద మూడు ఉచిత సిలిండర్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

డ్రోన్ టెక్నాలజీని కూడా సద్వినియోగం చేసుకోవాలనే సంకల్పంతో 80 శాతం సబ్సిడీపై వ్యవసాయానికి ఉపయోగించే కిసాన్ డ్రోన్స్ అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు సొమ్మును కూడా 24 గంటల లోపే రైతులకు చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. మైలవరం నియోజకవర్గంలో ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ కింద పల్లెల్లో రహదారుల అభివృద్ధికి రూ.32.92 కోట్లు మంజూరు చేశామన్నారు. బీటీ రహదారుల అభివృద్ధికి కూడా నిధులు మంజూరు చేశామన్నారు. కొన్ని చోట్ల రహదారుల నిర్మాణం పూర్తి కాగా కొన్ని పనులు వివిధ దశల్లో ఉన్నాయని అన్నారు. మైలవరం-వెల్వడం రోడ్డును కూడా అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), వ్యవసాయ శాఖ అధికారులు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The coalition government fulfilled the promise

You cannot copy content of this page

Scroll to Top