అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా కూటమి పాలన

TRINETHRAM NEWS

అన్నదాత సుఖీభవ, ఇన్పుట్ సబ్సిడీలు, ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే నగదు జమతో వ్యవసాయాన్ని పండగగా మార్చాం…

ఆత్రేయపురంలో జరిగిన అన్నదాత సుఖీభవ మూడో విడత పంపిణీలో ఎమ్మెల్యే బండారు

రూ.12.94 కోట్ల నమూనా చెక్కును రైతులకు అందించిన ఎమ్మెల్యే బండారు…

డిమాండ్ ఆధారిత పంటలపై రైతులు దృష్టి పెట్టాలని సూచన…

త్రినేత్రం న్యూస్ : అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. శుక్రవారం పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ మూడవ విడత పంపిణీలో భాగంగా ఆత్రేయపురంలో జరిగిన సభలో డి ఎల్ డి ఓ రాజేశ్వరరావు, ఆకుల రామకృష్ణ అయన పాల్గొని ప్రసంగించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం నిధుల విడుదల సందర్భంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగాలను తిలకించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని పేర్కొన్నారు.

గోదారమ్మ దయవల్ల మన ప్రాంతమంతా సస్యశ్యామలంగా ఉంటుందన్నారు. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ మూడవ విడతలో భాగంగా కొత్తపేట నియోజకవర్గంలో నేడు 23,085 మంది అన్నదాతల ఖాతాల్లో రూ.12.94 కోట్లను ప్రభుత్వం జమ చేసిందని తెలిపారు.కొత్తపేట మండలంలో 6516మంది అన్నదాతలకు రూ.3.57కోట్లు, ఆత్రేయపురం మండలంలో 5,258 మందికి రూ.3.03కోట్లు, రావులపాలెం మండలంలోని 5,018మంది అన్నదాతలకు రూ.2.72 కోట్లు,ఆలమూరు మండలంలో 6293 మంది అన్నదాతలకు రూ.3.62 కోట్లు జమవుతుందన్నారు. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ మొదటి విడతలో భాగంగా నియోజకవర్గంలో రూ.16.11 కోట్లు, రెండవ విడతలో భాగంగా రూ.15.26 కోట్లు రైతులు ఖాతాల్లో జమ అయ్యాయని పేర్కొన్నారు.

రైతులు సేంద్రియ వ్యవసాయం మీద, డిమాండ్ ఆధారిత పంటల సాగు మీద దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. వైసీపీ పాలనలో రైతులు పడ్డ కష్టాలు అన్ని ఇన్ని కావన్నారు. రైతు భరోసా పేరుతో ఏడాదికి ఒకే దఫాలో రూ.12,500 ఇస్తామని హామీ ఇచ్చి 3 దఫాల్లో కలిపి రూ.7,500 మాత్రమే ఇచ్చారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో పీఎం కిసాన్ కింద ఏడాదికి రూ.6వేలు అందిస్తుంటే.. దేశంలో ఎక్కడా లేని విధంగా కూటమి ప్రభుత్వం రూ.14వేలు కలిపి మొత్తం ఏడాదికి రూ.20,000 ఇచ్చి తమది రైతు పక్షపాత ప్రభుత్వమని నిరూపించుకున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 46,85,838 మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని తెలిపారు.

రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా దన్నుగా ఉంటుందన్నారు.రాయితీలపై వ్యవసాయ పరికరాలు ఇచ్చి సాగు రంగంలో సాంకేతికత జోడిస్తున్నామని తెలిపారు.గతంలో ఎన్నడూ లేని విధంగా రైతు కల్లంలో ధాన్యం అమ్మగానే 24 గంటల్లో నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామన్నారు.గత వైసీపీ ప్రభుత్వంలో ఈ డబ్బులు రావడానికి సుమారు ఆరు నెలలు పట్టేదని గుర్తు చేశారు. 2026-27 రాష్ట్ర బడ్జెట్ లో వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ. 53,752.12 కోట్లు కేటాయించి ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకున్నామన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

The welfare of the food givers

You cannot copy content of this page

Scroll to Top