Annadata Sukhibhava : రైతుపక్షం కూటమి ప్రభుత్వం

TRINETHRAM NEWS

అన్నదాత సుఖీభవ ఆరంభం….

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట, రైతులు కళ్ళల్లో ఆనందం చూసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా రైతుల కోసం ఇచ్చిన హామీ “అన్నదాత సుఖీభవ” పథకాన్ని శనివారం మండపేట శ్రీ సీతారామ కళ్యాణ మండపం లో ఘనంగా, పండగ వాతావరణంలో నిర్వహించారు. ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులు దీని ద్వారా లబ్ధి పొందనున్నారని పేర్కొన్నారు. మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు రూ.5 వేల చొప్పున రైతుల ఖాతాలో జమ చేశారన్నారు.

ప్రతీ రైతు కుటుంబానికి రూ 20 వేలు లబ్ది చేకూరే పరిస్థితి వుందన్నారు. మండపేట నియోజకవర్గంలో మొత్తం 18, 229 మంది రైతులకు అన్నదాత సుఖీభవ రూ 9.11 కోట్లు, ప్రధాన మంత్రి కిసాన్ ద్వారా రూ.3.38 కోట్లు మొత్తం రూ 12.49 కోట్లు లబ్ధిచేకురుతుందని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తే కూటమి ప్రభుత్వం వారి పక్షాన నిలిచిందని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం కూటమి ప్రభుత్వం లక్ష్యం గా పేర్కొన్నారు. ప్రతిపక్షం అసత్య ప్రచారం చేస్తుందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రైతుల సంక్షేమం కోసం చేస్తున్న కృషిని అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైతులకు మేగా చెక్కును పంపిణీ చేశారు.

మరో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర నీటి పారుదల అభివృద్ది సంస్థ చైర్మన్, జనసేన ఇన్ ఛార్జ్ వేగుళ్ళ లీలా కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో గతంలో పనిచేసిన ముఖ్య మంత్రులు అందరూ రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తే గత వైసీపీ హయాంలో రైతులను మోసం చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు గత ప్రభుత్వ హయాంలో బకాయి పడ్డ సొమ్ములు తక్షణమే చెల్లించారని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్, జిల్లా గ్రంధాలయ సంస్ధ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గడి సత్యవతి, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ మందపల్లి చంద్రశేఖర్, టీడీపీ టౌన్ అద్యక్షులు మచ్చా నాగబాబు, మాజీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, మండపేట మండల అధ్యక్షులు కర్రి తాతరావు, కపిలేశ్వరపురం మండల అధ్యక్షులు బలవరెడ్డి సత్తిబాబు, జనసేన టౌన్ అద్యక్షులు నామాల చంద్రరావు, రైతు నాయకులు మల్లిపూడి గణేష్, బీజేపీ నాయకులు కోన సత్యనారాయణ, మండపేట నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కోటిపల్లి వి.వి.సాయిరామ్, నియోజకవర్గ ప్రత్యేక అధికారి సివిల్ సప్లైస్ డి ఎం శ్రీనివాస్, ఆలమూరు వ్యవసాయ శాఖ ఏడి సిహెచ్ కెవి చౌదరి, మండపేట, కపిలేశ్వరపురం, రాయవరం మండల వ్యవసాయ శాఖ అధికారులు కె ప్రభాకర్, బి రవి, ఎన్ వి రమేష్ కుమార్, మండపేట తహసిల్దార్ తేజేశ్వరరావు, ఎంపిడిఓ సత్యనారాయణ, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్ లు, కూటమి నాయకులు, అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Rythu Paksham coalition government

You cannot copy content of this page

Scroll to Top