YSR Foundation Day : అరకులోయలో ఘనంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 16 వ ఆవిర్భావ దినోత్సవం

TRINETHRAM NEWS

అరకులోయ,మార్చి 13, (త్రినేత్రం న్యూస్): అరకులోయలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 16 వ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అరకు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ముందుగా ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పార్టీ జెండాను ఆవిష్కరించి, అనంతరం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తదుపరి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్సార్ ఆశయాలను సాధించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని సూచించారు. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందించిన గొప్ప ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమని పేర్కొన్నారు. 2029లో మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించేలా అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో ప్రజలకు చెప్పుకోదగ్గ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని విమర్శించారు. దేవుడిని అడ్డం పెట్టుకొని కాలం గడిపేస్తున్నారని ఆయన ఆరోపించారు. వైఎస్సార్ ఆశయాలను నెరవేర్చేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం అరకులోయ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కార్యదర్శి ఉపాధ్యక్షుడు రేగం చాణక్య, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ కార్యదర్శి పాంగి చిన్నారావు, అరకులోయ మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు విజయ్ కుమార్, గుడివాడ ప్రకాష్ రావు, మరియు సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

YSR Congress Party celebrates 16th foundation day

You cannot copy content of this page

Scroll to Top