పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళకృష్ణారెడ్డి
రామవరం లో ఘనంగా వైఎస్ఆర్ సిపి16 వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు
త్రినేత్రం న్యూస్, అనపర్తి, ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన పోరాటం అధికారపక్షంలో ఉండి ప్రజల కు సంక్షేమం అందించిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ సిపి అని పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధి అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సబ్బెళ్ళ కృష్ణారెడ్డి అన్నారు. రామవరం గ్రామంలో గ్రామ వై ఎస్ ఆర్ సి పి అధ్యక్షుడు నల్లమిల్లి వెంకటరెడ్డి మరియు గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి సబ్బెళ్ళకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి, సత్తి వీర్రెడ్డి ల కాంస్యవిగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించిన అనంతరం నాయకులు సమక్షంలో స్థానిక పంచాయతీ సెంటర్లో పార్టీ పతాకాన్ని ఎగరవేసి, కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సబ్బెళ్ళ కృష్ణారెడ్డి మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో 2011 వ సంవత్సరంలో ఆవిర్భవించిన వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడు 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటుందని, దాదాపుగా 11 సంవత్సరాలు ప్రతిపక్షంగా 5 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీగానిలబడి ప్రజల పక్షాన అనేక పోరాటాలు జరిపి అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు ప్రజల సంక్షేమం , రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేసిన పార్టీ , పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని, 2029 వ సంవత్సరంలో తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి, శాసన సభ్యుడిగా డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి లను గెలిపించే వరకు పార్టీ నాయకులు కార్యకర్తలు శక్తివంచన లేకుండా పనిచేయాలని కృష్ణారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ కమిటీ కార్యవర్గం, పార్టీ పలు అనుబంధం విభాగాల అధ్యక్షులు, పలువురు ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


