MLA Kavya Krishna Reddy : సెల్ఫీ పాయింట్ వద్ద ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

TRINETHRAM NEWS

జాతీయ జెండా ఆవిష్కరించిన కావలి
ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

త్రినేత్రం న్యూస్: జనవరి 26: నెల్లూరు జిల్లా :కావలి… గణతంత్ర దినోత్సవం వేడుకలు జాతీయ జెండా ఆవిష్కరించిన… ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి స్ఫూర్తి యాత్రను విజయవంతం చేయాలని పిలుపు.. కావలి పట్టణంలోని సెల్ఫీ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన 100 అడుగుల ఎత్తైన జాతీయ జెండా వద్ద సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి , పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారతదేశానికి స్వేచ్ఛతో పాటు రాజ్యాంగాన్ని అందించిన మహనీయులను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛాయుత జీవితం గడుపుతున్నామని తెలిపారు.

ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు సంక్షోభంలో ఉన్నప్పటికీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా నిలిచిందని, ఇందుకు ప్రధాన కారణం మన పూర్వీకులు రచించి మనకు అందించిన భారత రాజ్యాంగమేనని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, జాతీయ జెండాను మన గర్వ చిహ్నంగా భావిస్తూ ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. భారతదేశ గొప్పతనాన్ని భావి తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు.

ఇతర దేశాల వైపు చూసే మనస్తత్వం కాకుండా, మన దేశాన్ని ప్రేమిస్తూ, మన ఊరిని ప్రేమిస్తూ ముందుకు సాగాలని సూచించారు. కావలి నియోజకవర్గం నిరంతరం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని, అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనాయకులు నారా లోకేష్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రగతి బాటలో నడుస్తోందని పేర్కొన్నారు.

రేపటితో యువనాయకుడు నారా లోకేష్ యువగళం పాదయాత్రకు మూడు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా, వారి స్ఫూర్తితో రేపు ఉదయం 8:30 గంటలకు కావలి నుండి కొత్తపల్లి వరకు ప్రారంభించనున్న స్ఫూర్తి పాదయాత్రలో ప్రతి కార్యకర్త, నాయకుడు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు.

2000 కిలోమీటర్ల పాదయాత్ర మైలురాయికి కావలి నియోజకవర్గం సాక్ష్యంగా నిలిచిందని, ప్రతి సంవత్సరం ఈ స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి అడుగు లోకేష్ కి అంకితంగా భావిస్తూ ఈ స్ఫూర్తి యాత్రను దిగ్విజయంగా నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Republic Day celebrations at Selfie Point

You cannot copy content of this page

Scroll to Top