తేదీ : 03/10/2025. కర్నూలు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఎమ్మిగనూరు మండలం, కందనాతి చెన్నకేశవ స్వామి దసరా ఉత్సవాల్లో జమ్మి చెట్టు నుంచి రథాన్ని కొండపైకి తరలిస్తుండగా పక్కకు ఒరిగింది. భక్తులపై పడింది. ఈ ప్రమాదంలో పలువురు భక్తులు గాయపడ్డారు. వీళ్ళలో ఒకరి పరిస్థితి విషయంగా ఉంది. అక్కడి స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి క్షతగాత్రులను వైద్యశాలకు తరలించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


