MLA Bathula : రాజానగరం నియోజకవర్గంలో స్పౌజ్ పెన్షన్లు పంపిణీ

TRINETHRAM NEWS

రాజానగరం మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న బత్తుల..

అప్లై చేసుకున్న కొద్ది రోజుల్లోనే కొత్త పెన్షన్లు మన ఎమ్మెల్యే, బత్తుల

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, రాజానగరం నియోజకవర్గంలో కొత్తగా మంజూరైన స్పాజ్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు “బత్తుల బలరామకృష్ణ” ఆదేశాల మేరకు నేడు హొసింగ్ బోర్డు కాలనీ లో పెన్షన్ దారులకు స్వయంగా పింఛన్ అందజేసి, ఏ కష్టం వచ్చినా ఎల్లవేళలా మీకు మేమున్నాం అంటూ కొండంత భరోసా ఇచ్చిన,జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి,

ఈ సందర్భంగా బత్తుల వెంకటలక్ష్మి, మాట్లాడుతూ రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీలో ఏపీ ప్రభుత్వం ఒక పండుగలా నిర్వహిస్తుందని.. భర్త చనిపోతే వెంటనే భార్యకు పెన్షన్ అందించేలా చర్యలు చేపట్టిందని.. గతంలో 6 నెలలకు ఒకసారి కొత్త పెన్షన్లు మంజూరు చేసేవారని కానీ ఇప్పుడు కొత్తగా పెన్షన్ మంజూరు విధానంలో కీలక మార్పులు తీసుకువచ్చి లబ్దిదారులకు పెన్షన్ అందేలా చేస్తున్నామని,అంకితభావం, నిబద్ధత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సొంతమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు, సచివాలయ ఉద్యోగులు, పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Spouse pensions distributed

You cannot copy content of this page

Scroll to Top