జూన్ 26, 2026
TRINETHRAM NEWS

ఆటల పోటీల విజేతలకు బహుమతుల ప్రధానం

అరకులోయ ఫిబ్రవరి 7, (త్రినేత్రంన్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ విజ్ఞానభారతి (బి.వి.కె) పాఠశాలలో 31వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం ఘనంగా ఆటల పోటీలు మరియు బహుమతుల ప్రధానోత్సవం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి బి.వి.కె పాఠశాల కరెస్పాండెంట్ కె. కృష్ణ రావు, (ఏపీ.యూ డబ్ల్యూ.జె) ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ ఎల్.బి. వెంకటేశ్వర్లు, కాంట్రాక్టర్ సి.హెచ్. సింహాచలం నాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన అతిథులు “ఆటలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ గుణాలు పెంపొందిస్తాయి. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి” అని సూచించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచార్యులు కె. వెంకట్ రావు, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

31st anniversary celebrated in BVK School

You cannot copy content of this page