ఎంఎల్ఏ బాలు నాయక్.
డిండి (గుండ్లపల్లి) ఆగష్టు 14 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని వావిల్ కోల్ గ్రామ క్రికెటర్ వెంకటేష్ ను సన్మా నించి,అభినందనలు తెలిపిన సందర్భంగా దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ మాట్లాడుతూ యువత దేహదారుడున్యానికి మానసిక ఉల్లాసం మెరుగు పరుచుకోవడానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు, నేపాల్ దేశంలో జరిగిన ఇండియా వర్సెస్ నేపాల్ అండర్ 19 క్రికెట్ టోర్నమెంట్లో ఇండియా అండర్ 19 క్రికెట్ టీం విజయం సాధించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నుండి నల్గొండ జిల్లా డిండి మండలం వావిల్ కోల్ పోస్ట్ ఆఫీస్ లో పని చేస్తున్నటువంటి క్రికెటర్ వెంకటేష్ ను దేవరకొండ ఎమ్మెల్యే శాలువతో సన్మానించి అభినందనలు తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని అన్నారు, ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ముదిగొండ ఎల్లేష్ మాదిగ, తెలంగాణ మాదిగ సైన్యం రాష్ట్ర అధ్యక్షులు కత్తుల రవన్న మాదిగ, నాయకులు జుట్టు సతీష్, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


