త్రినేత్రం న్యూస్ పెనుమూరు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం స్వయంభు పులిగుంటేశ్వర స్వామి ఆవరణలో ఆరోగ్య యోగ నిర్వహించడం జరిగింది. ఇందులో జిల్లా ఆఫీసర్లు జిల్లా మెజిస్ట్రేట్, జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్, మరియు నాయకులు, యోగ అభిమానులు పాల్గొని యోగ చేశారు. ఇందులో ఉదయం 7 గంటల సమయంలో జ్యోతిని వెలిగించిన వారిలో జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ అలాగే జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు కార్జాల అరుణ పాల్గొని జ్యోతిని వెలిగించి యోగాన్ని ఆరంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు రుద్రయ్య నాయుడు, తలారి రెడ్డప్ప తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


