Nagababu : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొదటి ప్రాధాన్యత కార్యకర్తల క్షేమమే

TRINETHRAM NEWS

ఎం.ఎల్.సి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగబాబు కొణిదెల

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( చింతపల్లి ) జనసేన పార్టీ ఎమ్.ఎల్.సి రాష్ట్ర కార్యదర్శి నాగబాబు ప్రమాదవశాత్తు మరణించిన జనసైనికుల కుటుంబాలకు, ఇన్స్ రెన్స్ చెక్కుల పంపిణీ చేశారు.

చింతపల్లి మండలం వాసి కంచర్ల హరికృష్ణ గత సంవత్సరం తీర్థయాత్రలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో విజయవాడ సమీపంలో రోడ్డుప్రమాదంలో దుర్మరణమయ్యారు.మొదటి నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ వీరాభిమాని కావడంతో పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు.అధినేత పవన్ కళ్యాణ్ తమ కార్యకర్తల క్షేమం కోసం 500 రూపాయలకు ఏడాదిపాటు 5లక్షల రూపాయలు ప్రమాద భీమా కల్పిస్తూ వారికి వారి కుటుంబాలకు ప్రమాద భద్రత భీమా సౌకర్యం కల్పిస్తున్నారు.

ఈ సందర్భంగా అరకు పార్లమెంట్ మరియు పాడేరు ఇన్చార్జి డా.. గంగులయ్య మాట్లాడుతూ తన సొంత నిధులతో కార్యకర్తల క్షేమంకోసం భీమా పాలసీ ప్రారంభించిన దేశంలోనే తొలి ఏకైక పార్టీ జనసేన పార్టీ అని మారుమూల కుగ్రామాల కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ ని దేవుడిలా భావిస్తారనీ.ఈ రోజు కంచర్ల హరికృష్ణ కుటుంబానికి పిలిచి చెక్కుల పంపిణీ ఎమ్మెల్సీ నాగబాబు చేయడం కార్యకర్తలను ఉత్తేజితులను చేసిందన్నారు .ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి ఉల్లి సీతారామ్,చింతపల్లి మండలం ఉపాధ్యక్షులు కృష్ణమూర్తి,యూత్ అధ్యక్షులు గాజుల శ్రీను హరికృష్ణ కుటుంబ సభ్యులతో మంగళ గిరి జనసేన పార్టీ ఆఫిస్ లో హాజరయ్యారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Deputy Chief Minister Pawan

You cannot copy content of this page

Scroll to Top