రాష్ట్రంలో పనుల్లేక పస్తులుంటున్న కార్మికులు…
ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలి
కార్మికులు రోడ్డున పడకుండా చూడండి..
యూనియన్ అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ వినతి
దేవీచౌక్ లో ప్రజా ఫిర్యాదుల స్వీకరణలో వినతిపత్రం అందచేత
రాజమహేంద్రవరం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి : రాష్ట్రంలో పనుల్లేక పస్తులు ఉంటున్న కార్మికులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను వంద రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పిన నాయకులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగొందల రోజులైనా పట్టించుకోవడంలేదని ఆయన మండిపడ్డారు.
కార్మికుల బాధలు పడుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.ఇప్పటికైనా పట్టించుకోపోతే జూలై 4 ‘ఆకలి కేకలు’పేరుతో రోడ్డు మీద భిక్షాటన చేస్తామని బొజ్జ రామకృష్ణ చెప్పారు.డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజమండ్రి పర్యటనకు విచ్చేసిన సందర్భంగా దేవీచౌక్ లో అధికారులు ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కేంద్రంలో బొజ్జ రామకృష్ణ గురువారం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఒక వినతిపత్రం అంద జేశారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ సీ.ఎం పవన్ కల్యాణ్ తొలిసారిగా రాజమండ్రి వస్తున్నందుకు సంతోషం వ్యక్తంచేశారు.తమ సమస్యలను పరిష్కరించేందుకు పవన్ కల్యాణ్ కృషి చేయాలని ఆయన కోరారు.
భవన నిర్మాణ కార్మికులు,ఇతర రంగాలకు చెందిన కార్మికులు ఏళ్ళతరబడి ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం,కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్,యువ మంత్రి నారా లోకేష్ తగు చర్యలు తీసుకుని ఇకనైనా న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.లేకుంటే కార్మికులు రోడ్డున పడతారని బొజ్జ రామకృష్ణ అన్నారు.కార్మికుల సంక్షేమ బోర్డును యధావిధిగా కొనసాగించాలని, కార్మికులకు మ్యారేజీ స్కీం, డెలివరీ స్కీం విడుదలచేయాలని, యాక్సిడెంట్ మరణానికి,సహజ మరణానికి ఆర్థిక సహాయం చేయాలని, ఎన్.ఎ.సి.ట్రైనింగ్ విధానం వర్తింప చేయాలని కార్మికులు పిల్లలకు విద్య నిమిత్తం స్కాలర్ షిప్ లు ఇవ్వాలని, నిలిచిపోయిన 40 వేల క్లైములను విడుదల చేయాలని, కార్మికులకు సెస్ ఖర్చు చేయాలని కోరుతూ బొజ్జ రామకృష్ణ వినతి పత్రం సమర్పించారు.కార్యక్రమంలో విశ్వకర్మ వడ్రంగి పని వాళ్ళ సంఘం అధ్యక్షుడు దేవగుప్త శ్రీనివాస్,రాజమహేంద్రవరం ప్లంబర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు కొండపల్లి నాగేశ్వరావు, ఉపాధ్యక్షుడు సీతాల మునిరాజు, రాజరాజ నరేంద్ర పెయింటర్స్ వర్కర్స్ రెడ్ యూనియన్ అధ్యక్షుడు బోరపాటి రాజన్న, సభ్యులు లాజర్ వెంకట్రావు, గోవిందు లక్ష్మణరావు, శ్రీను, శ్రీ విజ్ఞేశ్వర బోర్డు సెంట్రింగ్ వర్కర్ యూనియన్ కార్యదర్శి మీసాల గణేష్ కుమార్, తాపీ పనివాళ్ల సంఘం నాయకుడు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


