బండారు సత్యానందరావు ఎమ్మెల్యే.కొత్తపేట..
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట కూటమి ప్రభుత్వం మాదకద్రవ్యాలు వినియోగంపై కఠిన చర్యలు తీసుకొని గంజాయి ఆంధ్రప్రదేశ్ అన్న మచ్చను తొలగించి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అనే విధంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు..
రాష్ట్రంలో డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల పూర్తిగా నిర్మూలించేందుకు ప్రత్యేక మంత్రుల కమిటీ నిత్యం పర్యవేక్షణ చేస్తుందని.. డ్రోన్లు జిపిఎస్ ట్రాకింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారిత సీసీ టీవీలు, సాంకేతిక పరిజ్ఞానంతో గంజాయి నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు..
గంజాయి సాగు, రవాణా, వినియోగంపై గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక సదస్సులు ఏర్పాటు చేసి వారికి అవగాహన కలిగిస్తుంది.. ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యల వల్ల గంజాయి సాగు 1100 ఎకరాల నుండి 100 ఎకరాలకు చేరుకుందన్నారు..
యువతలో డ్రగ్స్ వినియోగం, లిక్కర్ వినియోగం వంటివి ఎక్కువయ్యాని యువత బంగారు భవిష్యత్తుకు ఆటంకం కలిగించే ఇలాంటి వ్యసనాలు పట్ల విద్యార్థులకు తల్లదండ్రులకు నిరంతరం ప్రజాసేవలో ఉండే వారు అవగాహన కల్పించాలని కోరారు.మాదకద్రవ్యాలు తీసుకోవడం, మద్యపానం సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు మరణిస్తున్నారు. భారతదేశం నుండి అలాగే మన ఆంధ్ర దేశం నుండి గంజాయి వంటి మత్తు పదార్థాలను దేశం నుండి సమూలంగా తరిమివేసినప్పుడే దేశాభివృద్ధి జరుగుతుందని ..,దీనికి ప్రజల సహకారం అవసరం. డ్రగ్స్ పైన అవగాహన కలిగి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు..
*గంజాయి బానిసగా మారి పోలీసులపై తిరగబడ్డ వారికి పరామర్శలు, పలకరింపులు పేరిట ప్రోత్సాహం కలిగించే చర్యలను వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి ఇకనైనా మానుకోవాలని అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


