TRINETHRAM NEWS

Where is Naresh in the Gajularamaram incident?

Trinethram News : హైదరాబాద్ : గాజులరామారం కాల్పుల ఘటనలో తుపాకుల అంశం తెరపైకొచ్చింది.

ఈ ఘటనలో ప్రధాన నిందితుడు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ(BRS MLC) అనుచరుడిగా భావిస్తున్న నరేశ్‌ వద్ద తుపాకీ ఎందుకున్నది? దీనితో బెదిరించి ఏమైనా సెటిల్‌మెంట్లు చేశారా? కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో ఎంతమంది వద్ద లైసెన్స్‌లు లేని ఆయుధాలు ఉన్నాయి ? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఈ కేసు నుంచి తప్పించుకోడానికి నరేశ్‌ ఇప్పటికే అడ్వొకేట్‌ను సంప్రదించినట్టు తెలుస్తోంది.

ఇందులో భాగంగానే తుపాకీతో తానే కాల్పులుజరిపానని శివ అనే యువకుడిని పోలీసుల ఎదుట లొంగిపోయేలా చేశాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

నరేశ్‌ సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా, నిందితుడి ప్రేమికురాలిగా చెప్పుకుంటున్న యువతిని ఓ హాస్టల్‌లో ఉంచినట్టు సమాచారం.

రాజకీయ నేతలు స్థానిక పోలీస్‌ అధికారుల సాయంతో ఈ కేసును మూసివేయడానికి ప్రయత్నించడంతో సైబరాబాద్‌ కమిషనర్‌ సీరియస్‌ అయినట్లు తెలిసింది.

ప్రధాన నిందితుడు నరేశ్‌ను పట్టుకున్న తర్వాతే ఏదైనా మాట్లాడాలని గట్టిగా చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.

సెటిల్‌మెంట్లు, భూవివాదాలు, కొట్లాటల్లో ఆరితేరిన మల్లంపేట నరేశ్‌ కబ్జాలు చేస్తూ పలువురిని బెరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. కొంతకాలం క్రితం బిహార్‌ నుంచి కొన్ని తుపాకులు తెప్పించినట్టు తెలుస్తోంది. ఈ తుపాకులు ఎవరిని హత్య చేయడానికి తీసుకొచ్చారనేది తేలాల్సి ఉంది. కాగా, పరారీలో ఉన్న నరేశ్‌ కోసం నాలుగు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఆయన సెల్‌ఫోన్‌ కూడా పనిచేయడం లేదని తెలిసింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Where is Naresh in the Gajularamaram incident?