త్వరితగతిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానన్న ఎమ్మెల్యే గోరంట్ల…
Trinethram News : నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని, అభివృద్దే తన ధ్యేయమని, ఎన్టీఆర్ కాలనీ నందు త్వరితగతిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. ఈరోజు వేమగిరి శివారు ఎన్టీఆర్ కాలనీ నందు మండల పరిషత్ నిధులు 20 లక్షల రూపాయలు మరియు పంచాయతీ నిధులు 30 లక్షల రూపాయలు మొత్తం కలిపి 50 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించే సీసీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే గోరంట్ల ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎం.పీ.పీ వెలుగుబంటి సత్య ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ గత ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుతో ప్రజల్ని పూర్తిగా దగా చేసిందని, కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా సెంటు స్థలాన్ని కేటాయించి ప్రజల్ని మోసం చేసిందని అన్నారు.
మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద ప్రజలకు సంక్షేమ అందిస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నామని, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి ముందుకెళుతున్నామని అన్నారు. ఎన్టీఆర్ కాలనీ నందు ఈరోజు 50 లక్షల రూపాయలతో మెయిన్ రోడ్డు కి అనుసంధానంగా నూతన సీసీ రోడ్డు నిర్మించేందుకు శంకుస్థాపన చేసుకున్నామని, అలాగే గ్రామంలో మరొక 75 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నామని తెలిపారు. 50 లక్షల రూపాయలతో రోడ్డు మొత్తం పూర్తి కాదని వర్షాకాలం వచ్చేనాటికి ప్రజలు ఇబ్బంది పడకుండా దగ్గరలో నూతనంగా వేసిన లేఔట్ రోడ్లకు అనుసంధానం చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేస్తున్నామని అన్నారు.
రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ కాలనీ నందు మరిన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు ఒక కోటి రూపాయలు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే కాలనీలో ఉన్న కామన్ సైట్ నందు వాటర్ ట్యాంక్ నిర్మించేందుకు అంచనాలు సిద్ధం చేయాలని, త్వరితగతిన ట్యాంకు పూర్తి చేసే విధంగా అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం స్థానిక బుద్ధ విహార్ నందు పార్కును శుభ్రపరిచి మరింత ఆహ్లాదకరంగా ఉండేలా మంచి మొక్కలతో పార్కును మరింత సుందర వనంగా తీర్చిదిద్దాలని, పార్కును సుబ్రపరిచేందుకు తన వంతుగా 25000 రూపాయలు విరాళాన్ని బుద్ధ విహార్ నిర్వాహకులు జగదీశ్వరరావుకు అందించారు.
ఈ కార్యక్రమంలో మండల తెదేపా అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, మార్గాని సత్యనారాయణ, చెల్లుబోయిన శ్రీనివాస్, బోడపాటి గోపి, గుత్తుల కృష్ణ, పి.ఆర్ డి.ఈ రవి, ఎంపీడీవో రమేష్, పాఠంశెట్టి రాంజీ, కొప్పిశెట్టి నాగేశ్వరరావు, వాసంశెట్టి నాగబాబు, గుత్తుల హరిప్రసాద్, వారా రాము, వరగోగుల వెంకటేశ్వరరావు, పుల్లా రామారావు, జోగి చక్రవర్తి, వాసంశెట్టి బాలాజీ, ఈతకోట రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


