వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ :జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వికారాబాద్ పట్టణంలోని నారాయణ హై స్కూల్ లో చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ టి. వెంకటేష్ , ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతు బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన గురించి వివరించారు. విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి వివరించారు.
చట్టాలపై అవగాహన కలిగి ఉండడం మంచిదని వివరించారు. కుటుంబ సంబంధాల గురించి మరియు ప్రేమాభిమానాలు గురించి వివరించారు. సమాజంలో బాధ్యతాయుతమైన వ్యక్తులుగా మెలుగాలని ఆకాంక్షించారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థకు సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్-15100 ఉంటుందని వివరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చేసే పని గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎం. శ్రీనివాస్ , ప్యానల్ న్యాయవాది రాజశేఖర్ , మరియు బోధన సిబ్బంది పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


