వికారాబాద్ జిల్లా ప్రతినిధి:త్రినేత్రం న్యూస్… రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా వికారాబాద్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా బుధవారం మోమిన్‌పేట్ మండల కేంద్రంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర స్వయంగా బైక్ నడుపుతూ ర్యాలీలో పాల్గొని వాహనదారులలో స్ఫూర్తిని నింపారు.
ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎస్పీ మాట్లాడుతూ.. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను శిక్షల కోసం కాకుండా, తమ సొంత రక్షణ కోసం పాటించాలని కోరారు. క్షణ కాలం పాటు చేసే నిర్లక్ష్యం కుటుంబాలలో తీరని శోకాన్ని మిగిలిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువత హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం వల్లే ప్రమాద తీవ్రత పెరుగుతోందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని సూచించారు.
మోమిన్‌పేట్ ప్రధాన రోడ్ల పై సాగిన ర్యాలీలో విద్యార్థులు, పోలీసులు ప్లకార్డులతో రోడ్డు భద్రత నినాదాలు చేశారు. సీట్ బెల్ట్ ధరించడం, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎస్పీ స్వయంగా క్షేత్రస్థాయిలోకి వచ్చి అవగాహన కల్పించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సీఐ వెంకట్, ఎస్‌ఐ అరవింద్, పోలీస్ సిబ్బంది స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


