వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్.. జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ వికారాబాద్ జిల్లా, చెన్గోముల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు.ఈ పర్యటనలో భాగంగా, ఎస్పీ ముందుగా పోలీస్ స్టేషన్ ఆవరణను, సిబ్బంది విధుల నిర్వహణను, రికార్డుల నిర్వహణను, అలాగే పోలీస్ స్టేషన్‌లోని రిసెప్షన్, లాకప్ గదుల వంటి వివిధ విభాగాలను పరిశీలించారు. స్టేషన్ చరిత్ర, పరిధికి సంబంధించిన వివరాలను, గతంలో మరియు ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్యను, ప్రస్తుతం విచారణలో ఉన్న మరియు పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతి గురించి స్టేషన్ అధికారిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అధికారులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, వారితో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. ఫిర్యాదుదారులతో సానుభూతితో వ్యవహరించి, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. కేసుల విచారణలో నాణ్యత క్వాలిటీ అఫ్ ఇన్వెస్టిగేషన్) పాటించి, నిందితులకు శిక్ష పడే విధంగా చూడాలని ఆదేశించారు.
ముఖ్యంగా పోక్సో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు, మహిళలు మరియు బాలికలకు సంబంధించిన కేసులు, ఇతర గ్రేవ్ గ్రావెల్ కేసులలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వాటిని వేగవంతంగా పరిష్కరించాలని సూచించారు. ఆస్తి సంబంధిత నేరాలైన దొంగతనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని శ్రీమతి స్నేహ మెహ్రా స్పష్టం చేశారు.రాబోయే సర్పంచ్ ఎన్నికల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికలకు సంబంధించిన ముందస్తు సమాచారం సేకరించి పెట్టుకోవాలని తెలిపారు. సిబ్బంది తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, విధుల్లో క్రమశిక్షణతో పాటు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో చెన్గోముల్ ఎస్.ఐ. భరత్ కుమార్ రెడ్డి మరియు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


